KCR Press Meet : I will Participate In National Politics Says KCR | Oneindia Telugu

2018-12-12 71

Telangana Election Results : TRS president K Chandrashekhar Rao said Tuesday that "we are going to play a crucial role in national politics". The TRS is set to sweep the elections in Telangana.
తాను రాష్ట్రాన్ని చక్కగా పాలించుకుంటూనే జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తానని కేసీఆర్ చెప్పారు. రాబోయే నెల రోజుల్లో దేశ రాజకీయాల్లో మీరు గుణాత్మక మార్పులు చూస్తారని చెప్పారు. ఏం చేయబోతున్నామనేది త్వరలో చూస్తారని చెప్పారు. బీజేపీ ముక్త్ భారత్, కాంగ్రెస్ ముక్త్ భారత్ కావాల్సి ఉందని చెప్పారు. దేశానికి తెలంగాణ ఓ మార్గం చూపుతుందని అన్నారు. కొన్ని పార్టీలు నీచ రాజకీయాలు చేస్తున్నాయన్నారు. ఎన్నికలు వస్తున్న సమయంలో బీజేపీ సర్జికల్ స్ట్రయిక్స్, మందిర్ అంటూ తెరపైకి తీసుకు వస్తోందని మండిపడ్డారు. నాలుగు పార్టీలను ఏకం చేయడం రాజకీయం కాదని కేసీఆర్ చెప్పారు. దేశంలో 70వేల టీఎంసీల నీరు అందుబాటులో ఉన్నప్పటికీ తాము వాడుకోలేకపోతున్నామని చెప్పారు. తాము తెలంగాణ వేదికగా దేశానికి మేలు చేయబోతున్నామని చెప్పారు. పాలమూరు జిల్లాను పచ్చగా చేయబోతున్నామని, అందుకే 14 నియోజకవర్గాల్లో 13 సీట్లు గెలుచుకున్నామని చెప్పారు. త్వరలో ఉద్యోగ నోటిఫికేషన్ ఉంటుందని చెప్పారు. తెలంగాణలో ప్రతిపక్షం చాలా మూర్ఖంగా వ్యవహరించిందని ఆరోపించారు.
#kcr
#kcrinnationalpolitics
#KCRCommentsOnChandrababu
#2019generalelections
#KCRPressMeet